- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dil Raju: బాలీవుడ్‌తో దిల్ రాజు చర్చలు.. ఎందుకంటే?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.

దిశ, సినిమా: ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మాణంలో పొంగల్ స్పెషల్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని హిందీలో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. అలాగే ఇందులో హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ‘భూల్ భులయ్యా 2’, ‘రౌడీ రాఠోర్’, ‘లక్ష్మీ’ వంటి దక్షిణాది రీమేక్‌లతో హిట్ ట్రాక్‌లో ఉన్న అక్షయ్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేష్ పాత్రకు సరైన ఎంపికని భావిస్తున్నారు విశ్లేషకులు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.
- Tags
- Dil Raju






