- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిస్క్ గేమ్ ఆడనున్న దిల్ రాజు.. టార్గెట్ మిస్ అయితే భారీ నష్టాలే?
జటాయు ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తే దిల్ రాజు పెద్ద రిస్క్ తీసుకున్నట్లే అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా ఎదిగిన వారిలో దిల్ రాజు ఒకరు. నిర్మాతగా మారిన తర్వాత వరుస విజయాలతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్నారు. అయితే కెరీర్ ప్రారంభ దశలో వచ్చినంత స్థాయి విజయాలు ప్రస్తుతం దిల్ రాజుకు దక్కడం లేదు. ఇటీవల ఆయన నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం దిల్ రాజు, విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్ధన’, ఆశిష్ రెడ్డితో ‘దేత్తడి’ చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌తో ‘ఎల్లమ్మ’ అనే ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్న ప్రాజెక్ట్‌లలో ‘జటాయు’ ఒకటి.
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్‌పై చాలా కాలంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండను అనుకున్నప్పటికీ డేట్స్ సమస్యల కారణంగా ఇప్పుడు రోషన్ మేక పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడం, మరోవైపు రోషన్ మేకకు ఇప్పటివరకు సాలిడ్ కమర్షియల్ హిట్ లేకపోవడంతో ఈ కాంబినేషన్‌పై భారీ బడ్జెట్ పెట్టడం దిల్ రాజు తీసుకుంటున్న పెద్ద రిస్క్‌గా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.






