Dil Raju: ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కి చెప్పా.. ఆయన ఆనందం అంతా ఎగిరిపోయింది

by Pulgam srinivas |

దిల్ రాజు మాట్లాడుతూ... మున్నా సూపర్ హిట్ అవుతుందని ఆనందంలో ఉన్న ప్రభాస్‌కు అది యావరేజ్‌గానే నిలుస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయినట్లు ఈ నిర్మాత వెల్లడించాడు.

Dil Raju: ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కి చెప్పా.. ఆయన ఆనందం అంతా ఎగిరిపోయింది
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... “ప్రభాస్ మా బ్యానర్‌లో మొదటిసారి మున్నా సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా కంటే ముందు మేము నిర్మించిన చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథ అద్భుతంగా నచ్చడంతో మున్నా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని భావించి నిర్మించాం.

సినిమా పూర్తై థియేటర్లలో విడుదలైంది. నేను థియేటర్‌లో సినిమా చూసిన తర్వాత ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది. అదే విషయాన్ని ప్రభాస్‌కి చెప్పాలని ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటికే కొన్ని సోర్సెస్ నుంచి మంచి రివ్యూలు రావడంతో ప్రభాస్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సమయంలోనే నేను వెళ్లగా, ప్రభాస్ నా దగ్గరకు వచ్చి ‘హిట్ కొట్టేశాం’ అని అన్నాడు. దాంతో నేను, ‘అంత పెద్ద హిట్ అవ్వదు. మహా అయితే యావరేజ్ లేదా దగ్గర సినిమా ఆగిపోవచ్చు’ అని చెప్పాను.

దానికి ప్రభాస్ షాక్ అయ్యి, ‘నాకు తెలిసినంతవరకు సినిమా హిట్ అవుతుంది’ అని అన్నారు. నేను మాత్రం ‘అలా అయితే అదృష్టమే. కానీ యావరేజ్‌కి ఫిక్స్ అయితే బెటర్’ అని చెప్పాను. చివరికి నేను చెప్పినట్లే మున్నా యావరేజ్ సినిమాగా మిగిలింది” అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటించగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

Next Story