- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిల్ రాజు: 'గాయపడ్డ సింహం'కు థియేటర్లు కష్టమే.. తర్వాత నేనేమీ చేయలేను
దిల్ రాజు మాట్లాడుతూ... పెద్ది ఏప్రిల్ 30న విడుదలయితే గాయపడ్డ సింహం చిత్రానికి పెద్ద ఎత్తున థియేటర్లు దొరకడం కష్టమే అని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీ యూనిట్ ఈరోజు ఓ ఈవెంట్ నిర్వహించి, చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు మాట్లాడుతూ… ఇదే సమయంలో ఏప్రిల్ 30న రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారని, అదే జరిగితే ‘గాయపడ్డ సింహం’ సినిమాకు థియేటర్లు పెద్ద స్థాయిలో దొరకకపోవచ్చని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎవరూ తనను అపార్థం చేసుకోవద్దని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఈ లెక్కన ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల అయితే, ‘గాయపడ్డ సింహం’ చిత్రానికి థియేటర్ల విషయంలో పోటీ తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో తరుణ్ భాస్కర్ సరసన మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, విష్ణు ఓయి తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.






