Dil raju: మావల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

by Pulgam srinivas |

దిల్ రాజు మాట్లాడుతూ... నేను నిర్మించిన కృష్ణాష్టమి మూవీ కథలో అనేక మార్పులు చేశాము, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అని ఈ నిర్మాత చెప్పుకొచ్చారు.

Dil raju: మావల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణాష్టమి అనే సినిమాను నిర్మించాడు. అందులో సునీల్ హీరోగా నటించగా నిక్కీ గల్రానీ, డింపుల్ చోప్రా హీరోయిన్లుగా నటించారు. వాసు వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దిల్ రాజు మాట్లాడుతూ... నేను నిర్మాతగా కెరీర్ను ప్రారంభించిన కొత్తలో దాదాపు అందరు దర్శకులకు హిట్లు ఇచ్చాను.

వాసు వర్మ నా బ్యానర్లో రూపొందిన జోష్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయనకు కూడా మంచి విజయం దక్కుతుందని అనుకున్నాను, కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత ఎలాగైనా ఆ దర్శకుడికి మంచి విజయం అందించాలి అనుకున్నాను, కోనా వెంకట్ దగ్గర ఒక కథ విన్నాను, అది చాలా బాగా నచ్చింది. దానితో ఆ కథను తీసుకొని వాసు వర్మతో దానిని రూపొందించాలనుకున్నాను. వాసు వర్మ కూడా అందుకు ఒప్పుకున్నాడు.

కానీ ఆ స్టోరీ ఓకే అయ్యాక ఆ మూవీని మొదలు పెట్టడానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దానితో మేము స్టోరీలో అనేక మార్పులు చేశాము. సినిమా మొత్తం పూర్తయింది, విడుదల అయ్యాక ఫ్లాప్ అయింది. అందుకు ప్రధాన కారణం... మేము కథలో మార్పులు చేయడం వల్ల అది మిస్ ఫైర్ అయింది. కోన మాకు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ కథను ఇచ్చాడు. మేము దానిలో అనేక మార్పులు చేయడం వల్ల అది బెడిసి కొట్టి ఆ సినిమా ఫెయిల్యూర్ అయింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

Next Story