పవన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన దిల్ రాజు.. కారణం అదేనా?

by Pulgam srinivas |

పవన్ 'సత్యాగ్రహి' సినిమాకు మొదట దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అయితే పవన్ స్టార్‌డమ్‌ను తట్టుకోవడం కష్టం అవుతుందని భావించి దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన దిల్ రాజు.. కారణం అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి అనేక సంవత్సరాలు ప్రయత్నించారు. అందులో భాగంగా నిర్మాతగా మారిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన 'వకీల్ సాబ్' చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈయన కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా నుండి ఆయన తప్పుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎందుకు తప్పుకున్నారు? అనే వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ 'సత్యాగ్రహి' అనే సినిమా చేయాలని అనుకున్నారు. ఈ సినిమా కోసం ఆయనే స్వయంగా కథ రాసుకొని దర్శకత్వం కూడా వహించాలని భావించారు. ఈ సినిమా ప్రారంభ దశలో ఉన్న సమయంలో అప్పటికే నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను తట్టుకోవడం కష్టం అవుతుందని, అలాగే సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఏ ఎం రత్నం ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు.

ఆ తర్వాత కొంతకాలానికి ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. లాంచింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు, అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతరం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే బడ్జెట్ భారీగా పెరుగుతుండటం, నిర్మాత రిస్క్‌లోకి వెళ్లే అవకాశం ఉందనే కారణాలతో ఈ చిత్రాన్ని చివరికి ఆపివేశారు. ఇలా మొదటగా దిల్ రాజు నిర్మాతగా అనుకున్న ఈ ప్రాజెక్ట్‌లోకి తర్వాత ఏ ఎం రత్నం ఎంట్రీ ఇచ్చినా, ఆయనతో కూడా ఈ సినిమా పూర్తి కాలేకపోయింది.

Next Story