Game Changer: " అప్పన్న మనందరి హృదయం" అంటూ ఎమోషనల్ ట్వీట్ పెట్టిన దిల్ రాజు

by Phanindra |   (  Updated:2025-01-12 13:41:04  IST  )

" అప్పన్న మనందరి హృదయం" గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుత ప్రదర్శనకు సాక్షి

Game Changer:  అప్పన్న మనందరి హృదయం అంటూ ఎమోషనల్  ట్వీట్ పెట్టిన దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ " మూవీ జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ వచ్చినా ప్రస్తుతం, బాగానే నడుస్తుంది. నార్త్ లో అయితే గేమ్ ఛేంజర్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అయితే, తాజాగా నిర్మాత దిల్ రాజు ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం, నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. కేవలం పాటలకు రూ. 75 కోట్లు పెట్టామని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు చెప్పుకొచ్చాడు. " అప్పన్న మనందరి హృదయం" గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుత ప్రదర్శనకు సాక్షి . అప్పన్న గా మీ దగ్గర్లో ఉన్న థియేటర్లోనే ఉన్నాడు. టికెట్స్ బుక్ చేసుకుని ఇప్పుడే చూడండి " అంటూ ఎమోషనల్ గా ఎక్స్ ( X)లో ట్వీట్ చేశాడు.


Click Here For Tweet..

Next Story