Dil Raju: ‘ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే సంతోషంగా ఉంది’.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |
Dil Raju: ‘ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే సంతోషంగా ఉంది’.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Producer Dil Raju) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే ఈయన నిర్మించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Walkitlo Sirimalle Chettu) థియేటర్లలో మళ్లీ విడుదల అవుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వం వహించారు.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే వీరికి జంటగా అంజలి (Anjali)-సమంత (Samantha) కథానాయికలుగా నటించి నెటిజన్లను మెప్పించారు. దాదాపు ఈ చిత్రం పన్నెండు ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోన్న సందర్భంగా దిల్‌ రాజు ప్రెస్‌మీట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నెటిజన్లతో కలిసి చూడానికి నేను కూడా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నానని దిల్ రాజు వెల్లడించాడు. ఈ నెల (మార్చి) 7 వ తేదీన మళ్లీ విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని తెలిపాడు. ప్రస్తుత రోజుల్లో జనాలు థియేటర్లకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటుంటారు.. కానీ ఈ మూవీ టీవీ, ఓటీటీలో ఇప్పటికీ అనేక సార్లు ప్రసారం అయ్యిందని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం వీక్షించడానికి జనాలు టికెట్లు బుక్ చేసుకున్నారు. పది థియేటర్లు ఫుల్ అయిపోయాయని అన్నారు. కథ బాగుంటే జనాలు తప్పకుండా సినిమా చూస్తారని.. ప్రెజెంట్ ప్రేక్షకుల రియాక్షన్ చూస్తుంటే ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు వెంకటేష్ అండ్ మహేష్ బాబు వెంటనే ఓకే అని అన్నారని.. కానీ మేమంతా అనుకున్నట్లుగా స్టోరీనీ తెరపైకి తీసుకురావడానికి చాలా టైమ్ పట్టిందని తెలిపాడు.

వెంకీ, సూపర్ స్టార్ ఈ మూవీ కోసం కలిసి కష్టపడ్డారని, ఇక ఖాళీ టైంలో డిన్నర్‌కు వెళ్లేవారని, సినిమా గురించి మాట్లాడేవారని అన్నారు. అలాగే ఈ రీరిలీజ్ ట్రెండ్ వల్ల కొత్త మూవీలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? అని ప్రశ్నించగా.. ఎంత పెద్ద మూవీ అయినా సరే కంటెంట్ బాగుంటే జనాలు తప్పకుండా చూస్తారని, నచ్చకపోతే మాత్రం మార్నింగ్ షోకే బై బై చెబుతారని దిల్ అన్నారు.



Next Story

Most Viewed