- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏ పనిలో ఉన్నా ప్రభుత్వం అవార్డు ఇస్తే రావాలి: దిల్ రాజు
ప్రభుత్వం నుండి అవార్డు వస్తోందంటే దాన్ని స్వీకరించడం గ్రహీతల బాధ్యత అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఎక్కడ ఉన్నా అవార్డు ఇచ్చే సమయానికి అందుబాటులో ఉండాలని కోరారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం నుండి అవార్డు వస్తోందంటే దాన్ని స్వీకరించడం గ్రహీతల బాధ్యత అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఎక్కడ ఉన్నా అవార్డు ఇచ్చే సమయానికి అందుబాటులో ఉండాలని కోరారు. త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులను ప్రకటిస్తుందని అన్నారు. టాలీవుడ్ కు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అని చెప్పారు. ఎన్ని షూటింగ్స్ లో బిజీ ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుండి అవార్డులు వస్తున్నాయంటే వెళ్లి స్వీకరించాలని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరికీ ఇది రిక్వెస్ట్ అని, అర్థం చేసుకోవాలని అన్నారు. అవసరం అయితే అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ డైరీలో రాసుకుని షూటింగ్ కు బ్రేక్ తీసుకోవాలని చెప్పారు. అవార్డుల వేడుక కోసం ఆరు నెలలు కష్టపడ్డామని అన్నారు. ప్రతి కేటగిరికీ కమిటీలు వేశామని తెలిపారు. తెలంగాణలో అవార్డుల ఫంక్షన్ నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.






