టాక్సిక్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశా.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్

by Pulgam srinivas |   (  Updated:2026-02-13 06:32:36  IST  )

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. టాక్సిక్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను 120 కోట్లకు కొనుగోలు చేశానని చెప్పారు. అది నమ్మని వారికి బ్యాంక్ స్టేట్మెంట్ తో సమాధానం సమాధానం చెబుతానని అన్నారు.

టాక్సిక్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశా.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మాతగా, పంపిణీదారునిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన వరుస పెట్టి సినిమాలను నిర్మించడమే కాకుండా అనేక భారీ, చిన్న సినిమాలను విడుదల కూడా చేస్తున్నాడు. తాజాగా ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాడు. కన్నడ స్టార్ నటుడు యాష్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీని మార్చి 19వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నారు. కాగా మూవీ విడుదల తేదీనే ధురంధర్ 2 మూవీ కూడా విడుదల కానుంది.

ఆ తర్వాత వారం రోజులకే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కానుంది. దీంతో టాక్సిక్ చిత్రానికి హిందీ, తెలుగు మార్కెట్ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది, సూపర్ సాలిడ్ టాక్ వస్తే తప్ప ఈ రెండు ప్రాంతాల్లో గట్టి కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టలేదు అని చాలామంది ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఇలాంటి సమయంలో దిల్ రాజు టాక్సిక్ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏకంగా 120 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. దాంతో చాలా మంది ఇది నిజమైన వార్త లేక పబ్లిసిటీ స్టాంటా అని అభిప్రాయపడ్డారు.

కేజిఎఫ్ పార్ట్ 2 మూవీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తేనే 85 కోట్ల షేర్ మార్క్ను తెలుగు రాష్ట్రాల్లో టచ్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు నిజంగానే ఈ సినిమాను అంత ధరకు కొనుగోలు చేశాడా? అనే వార్త తెలుగు ఫిలిం సర్కిల్లో వైరల్ అయింది. తాజాగా దిల్ రాజు ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో పాత్రికేయులు దిల్ రాజును మీరు టాక్సిక్ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 120 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు, అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అనే ప్రశ్న పాత్రికేయుల నుండి దిల్ రాజుకు ఎదురైంది. దానికి దిల్ రాజు అలా అనుమానపడే వారికి నేను నా బ్యాంకు నుండి అమౌంట్ పంపాక దానిని వారికి ఇస్తాను, అప్పుడు వారికి తెలుస్తుంది ఏది నిజం అనేది అని సమాధానం ఇచ్చాడు.

‘టాక్సిక్’కి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్..

Next Story