- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టాక్సిక్’కి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్..
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక చారిత్రాత్మక డీల్‌గా నిలిచింది. ఏకంగా రూ. 120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
విదేశీ పంపిణీదారులలో ఒకరైన ఫార్స్ ఫిల్మ్ ‘టాక్సిక్’ మూవీని కొనుగోలు చేసింది. ఇది సినిమా అసాధారణ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్‌లో మరో భారీ మైలురాయిగా నిలిచింది. ఈ డీల్‌ను ఒక భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అత్యధిక ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్‌గా చెబుతున్నారు. కమిషన్ ప్రాతిపదికన రూ.105 కోట్లు అడ్వాన్స్‌గా పొందారు. ఇది ప్రపంచ మార్కెట్ నుండి ‘టాక్సిక్’ మీదున్న నమ్మకాన్ని చాటుతోంది. ఈ లెక్కలు సినిమాపై సినిమాపై హై ఎక్స్‌పెక్టేసన్స్‌ను పెంచేస్తున్నాయి. కాగా.. యష్ నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు నేపాల్, జపాన్, చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు.






