ప్రశాంత్ నీల్ తో మెగా హీరో మూవీ.. హింట్ ఇచ్చిన దిల్ రాజు

by velandi.Saikiran |

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ( Dil Raju) కీలక ప్రకటన చేశారు. ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తాజాగా

ప్రశాంత్ నీల్ తో మెగా హీరో మూవీ.. హింట్ ఇచ్చిన దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ( Dil Raju) కీలక ప్రకటన చేశారు. ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తాజాగా అధికారిక ప్రకటన చేశారు. రామ్ చరణ్ వర్సెస్ దిల్ రాజు ఫ్యామిలీ మధ్య జరిగిన వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఫ్యామిలీని.. ఉద్దేశించి రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు.

దీనికి దిగివచ్చిన దిల్ రాజు సోదరుడు.. క్షమాపణలు చెప్పడమే కాకుండా... రామ్ చరణ్ కు కూడా ప్రత్యేకంగా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో ఈ వివాదం.. టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు.

ఆ ప్రాజెక్టు పూర్తి కాగానే ప్రశాంత్ అలాగే అల్లు అర్జున్ కాంబో సినిమా ఉంటుందని వెల్లడించారు దిల్ రాజు. వీరి కాంబినేషన్ లో రావణం అనే చిత్రాన్ని ప్లాన్ చేశామని గుర్తు చేశారు. వాళ్ళిద్దరూ వేరు వేరు ప్రాజెక్టులలో బిజీగా పేర్కొన్నారు దిల్ రాజు. అందుకే కొత్త ప్రాజెక్టుకు కాస్త సమయం పడుతుంది అని తమ్ముడు ప్రమోషన్స్ సందర్భంగా దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నామని కూడా వివరించారు.

Next Story