- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగీత్ శోభన్.. మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని మీకు తెలుసా?
సంగీత శోభన్ నటుడిగా పరిచయం కాకముందే మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు సంగీత్ శోభన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటుడిగా కెరీర్ను మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికే చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నిహారిక కొణిదల నిర్మించిన రాకాస అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సంగీత్ శోభన్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు.
సంగీత్ శోభన్ నటుడుగానే మనందరికీ తెలుసు, కానీ ఆయన నటన రంగంలోకి రాకముందే ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఆ సినిమా కూడా టాలీవుడ్ స్టార్ హీరో మూవీ కావడం విశేషం. ఇంతకు సంగీత శోభన్ ఏ హీరో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు అనుకుంటున్నారా? సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు. కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాకు ఈ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా సంగీత్ శోభన్ మాట్లాడుతూ... నేను నటుడిగా పరిచయం కాకముందే మహర్షి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ఆ సమయంలో మా అమ్మగారు నమ్రత గారి వద్ద పనిచేసేవారు. దానితో ఒకరోజు వంశీ పైడిపల్లి గారిని మా అబ్బాయి మీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి అనుకుంటున్నాడు అని చెప్పింది, దానికి ఆయన కూడా ఓకే అన్నారు. అలా నేను ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశానని ఈ యువ హీరో చెప్పుకొచ్చాడు.






