- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోనాలిసా అందమే తనకు శాపంగా మారిందా?..ఆ ఐదుగురి పై FIR నమోదు! కారణం ఏంటంటే?
కుంభమేళా బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి అందరికీ తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: కుంభమేళా బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన మోనాలిసా పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ప్రయోగరాజ్(Prayaga Raj)లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది. కుంభమేళాలో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మోనాలిసాను చూసిన కొందరు యూట్యుబర్ ఇన్‌ఫ్లూయర్స్ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో నెట్టింట ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. దీంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన మోనాలిసాకు బాలీవుడ్ డైరెక్టర్(Bollywood Director) సనోజ్ మిశ్రా(Sanoj Mishra) సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.
ఈ తేనెకళ్ల బ్యూటీ మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాతో చనువుగా ఉండడంపై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సనోజ్ మిశ్రా ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
‘‘తప్పుడు వ్యాఖ్యలతో తన గౌరవాన్ని దిగజారుస్తున్నారు, మోనాలిసాను రోడ్డుకు ఈడుస్తున్నారు’’ అని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అంబోలీ స్టేషన్ పోలీసులు ఐదుగురిపై FIR నమోదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసిన వారిలో జితేంద్ర నారాయణ సింగ్, వాసిమ్ రజ్వీ, రవి సుధా చౌదరీ, మహీ ఆనంద్, మారుత్ సింగ్, అభిషేక్ ఉపాధ్యాయా ఉన్నారు. దీంతో మోనాలిసా మొదటి సినిమాలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.






