కియారా అద్వానీ అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిందా..? వావ్ బేబీ ఎంత క్యూట్‌గా ఉందో.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కియారా అద్వానీ అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిందా..? వావ్ బేబీ ఎంత క్యూట్‌గా ఉందో.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘వార్-2’ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటూ 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీ ప్రజెంట్ ప్రగ్నెట్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ జంట రీసెంట్‌గా తమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో కియారా అద్వానీకి అప్పుడే డెలివరి అయిపోయనట్లు ఉంది. హాస్పిటల్ బెడ్‌పై బేబీతో ఉంటే పక్కనే సిద్ధార్థ్ మల్హోత్ర కూడా ఉన్నాడు. అలాగే ఇంకో పిక్‌లో కియారా బేబీని ఎత్తకున్నట్లు ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. అప్పుడే కియారా బిడ్డకు జన్మనిచ్చిందా అని కొంతమంది రియాక్ట్ అవుతుంటే, మరికొంత మంది ఇది ఫేక్ ఫొటో అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బేబీ మాత్రం చాలా క్యూట్‌గా ఉంది.

Next Story