‘పుష్ప2’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ మెగాస్టార్‌‌ను కలిశారా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఫొటో

by Kavitha |
‘పుష్ప2’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ మెగాస్టార్‌‌ను కలిశారా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఫొటో
X

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా ‘పుష్ప 2’(Pushpa 2) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్లు కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీగా ఉంది. అయితే స్టార్టింగ్‌లో పుష్ప మూవీ టికెట్స్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పెరిగిన రేట్లతో సామాన్యులు సినిమా చూడలేకపోతున్నారు అని అనుకున్నారో ఏమో కాబోలు సోమవారం మేకర్స్ పుష్ప టికెట్ ధరలను భారీగా తగ్గించారు. దీంతో సినీ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి(Mega Family), అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. రోజు రోజుకీ మెగా ఫ్యామిలీకి, బన్నికి మధ్య దూరం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో హల్‌చల్‌ చేస్తోంది. మెగాస్టార్‌ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్‌.. చిరంజీవి, సురేఖతో కలిసి దిగిన ఫొటో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘పుష్ప2’ సక్సెస్‌ తర్వాత మెగాస్టార్‌ని అల్లు అర్జున్‌ కలిసిన ఫొటోయేనా ఇది? అనే ఆలోచనలో పడ్డారు. అయితే నిజానికి ఇది ఇప్పటి ఫొటో కాదు. 'పుష్ప'(Pushpa) చిత్రానికి అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు వచ్చినపుడు చిరంజీవి(Chiranjeevi) తన భార్య సురేఖ(Surekha)తో కలిసి వెళ్ళి బన్నీని అభినందించారు. ఇక అప్పటి ఫొటోను ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed