రేప్ సీన్ చేశాక వాంతులు చేసుకున్నా.. ఒళ్లంతా వణికిపోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-05 15:54:52  IST  )

సీనియర్ నటి దియా మీర్జా బ్యూటీ, ఇన్నోసెన్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించింది. కానీ స్టార్టింగ్ నుంచి సాఫ్ట్ పాత్రలే చేస్తున్న ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త ప్రయోగం చేసింది. ‘కాఫిర్’ సినిమాతో

రేప్ సీన్ చేశాక వాంతులు చేసుకున్నా.. ఒళ్లంతా వణికిపోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి
X

దిశ, ఫీచర్స్ : సీనియర్ నటి దియా మీర్జా బ్యూటీ, ఇన్నోసెన్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించింది. కానీ స్టార్టింగ్ నుంచి సాఫ్ట్ పాత్రలే చేస్తున్న ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త ప్రయోగం చేసింది. ‘కాఫిర్’ సినిమాతో ఓటీటీ ఇండస్ట్రీకి ఎంటరైన ఆమె.. కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అనుకోకుండా ఇండియాకు ఎంటరైన పాకిస్తాన్ అమ్మాయి రోల్‌లో కనిపించిన దియా.. ఇందులో ఓ సీన్ చేసినప్పుడు తన బాడీ షేక్ అయిందని తెలిపింది. ఇందుకోసం చాలా కష్టపడ్డానని చెప్పింది.

కాగా ‘కాఫిర్’లో రేప్ సీన్ తనలో వణుకు పుట్టించిందన్న దియా.. ఈ సీన్ చేశాక బాడీ షివర్ అయిందని, వాంతులు కూడా చేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. లైఫ్‌లో మరిచిపోలేని ఎక్స్‌పీరియన్స్ చేశానని తెలిపింది. అంతేకాదు ఇందులో తల్లిపాత్రలో కనిపించిన ఆమె.. అమ్మతనం గురించి తాను మరింత నేర్చుకున్నట్లు వివరించింది. ఈ సినిమా అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనంటూ.. త్వరలోనే మరిన్ని ప్రొఫెషనల్ అప్‌డేట్స్ ఇస్తానని చెప్పింది.

Next Story