- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ధురంధర్ ది రివెంజ్' నాలుగు వారాల బాక్సాఫీస్ రిపోర్ట్
ధురంధర్: ది రివెంజ్ చిత్రానికి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలియజేస్తూ మూవీ బృందం అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ తాజాగా ధురంధర్: ది రివెంజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్ర మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండో భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాంటి భారీ అంచనాల మధ్య మార్చి 19న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ లభించింది. దాంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు వారాల బాక్సాఫీస్ రన్ పూర్తి అయింది.
ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు ఇప్పటివరకు ఏ ఏరియాల్లో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి, మొత్తంగా ఎన్ని వసూళ్లు దక్కాయి అనే వివరాలను వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹1783 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఇండియాలో ₹1360 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం తన సత్తాను చాటుతూ ₹423 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
ఇక ఇండియా నెట్ కలెక్షన్ల పరంగా చూస్తే, ఈ సినిమా ఇప్పటికే ₹1153 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్ కీలకమైన పాత్రలో కనిపించాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించారు. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.






