- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాధ్యం కాదన్నదాన్ని చేసి చూపెట్టిన ‘ధురంధర్: ది రివెంజ్’
ధురంధర్ 2, పుష్ప 2 కలెక్షన్లను దాటడం కష్టమే అని కొంతమంది భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే పుష్ప పార్ట్-2 లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పోయిన సంవత్సరం చివర్లో విడుదలై పెను సంచలనం సృష్టించిన చిత్రాలలో ధురంధర్ ఒకటి. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ధురంధర్: ది రివెంజ్ చిత్రానికి కూడా బ్లాక్‌బస్టర్ టాక్ లభించింది. దాంతో ఈ సినిమాకు వేగంగా వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు మొదట అంచనా వేశారు. ఆ తర్వాత కొంతకాలం ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పుష్ప: ది రూల్ మూవీ కలెక్షన్లను ఈ చిత్రం దాటడం కష్టమే అని కొంతమంది భావించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే పుష్ప పార్ట్-2 లైఫ్‌టైమ్ వసూళ్లను దాటేసినట్లు తెలుస్తోంది. కలెక్షన్ల విషయంలో ధురంధర్: ది రివెంజ్ కంటే ముందు వరుసలో బాహుబలి 2: ది కన్క్లూజన్ రూ. 1789 కోట్లు, అలాగే దంగల్ రూ. 2070 కోట్ల వసూళ్లతో ముందున్నాయి. మరి ఈ రెండు చిత్రాలలో దేనినైనా ధురంధర్: ది రివెంజ్ దాటేస్తుందా లేదా అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో మరికొన్ని రోజులు ఈ మూవీకి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటించగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.






