- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీలో పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన ధురంధర్
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన సినిమా ధురంధర్.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన సినిమా ధురంధర్. ఇంటెన్స్ యాక్షన్ స్పై సినిమాగా వచ్చిన ఈ సినిమా ఒక్కభాషలోనే విడుదలైనా.. సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. రికార్డుస్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ పోతోంది. హిందీలో విడుదలైన పుష్ప-2 కొత్త రికార్డులు సెట్ చేయగా.. ఓపెనింగ్స్ మినహా మగతా అన్ని రికార్డులను ధురంధర్ ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తోంది.
పుష్ప-2 సెట్ చేసిన యూనిక్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఒక్కవారంలోనే 199 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన పుష్ప-2 ని చూసి అందరూ షాకవ్వగా.. ధురంధర్ ఆ రికార్డును రూ.200 కోట్లతో బద్దలు కొట్టింది. A సర్టిఫికెట్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఎవరి ఊహకు అంతుచిక్కడం లేదు. ఇది ఇంతటతో ఆగేలా లేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తన్నాయి. ఏదేమైనా ధురంధర్ ముందు ముందు మరిన్ని వసూళ్లు రాబట్టాలని బాలీవుడ్ ఆకాంక్షిస్తోంది.






