డ్రాగన్‌లో ఛాన్స్ కొట్టేసిన ధురంధర్ నటుడు

by Pulgam srinivas |

జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో ఛాన్స్ దక్కినట్లు ధురంధర్ నటుడు బిమల్ ఒబెరాయ్ చెప్పుకొచ్చాడు.

డ్రాగన్‌లో ఛాన్స్ కొట్టేసిన ధురంధర్ నటుడు
X

దిశ, వెబ్ డెస్క్: హిందీలో మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ధురంధర్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ధురంధర్: ది రివెంజ్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అనేకమంది నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. ధురంధర్ మొదటి భాగం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటులలో బిమల్ ఒబెరాయ్ ఒకరు.

తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఈ నటుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బిమల్ ఒబెరాయ్ మాట్లాడుతూ… "ధురంధర్ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నాకు ఫోన్ చేసి, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ పాత్ర కోసం అడిగారు. ఆ తర్వాత నా మీద ఫోటోషూట్ కూడా చేశారు. ఆ ఫోటోషూట్ కి వారు సంతృప్తి చెందారని చెప్పారు. ఎన్టీఆర్–ప్రశాంత్ కాంబినేషన్ సినిమాలో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది" అని ఈ నటుడు తెలిపారు.

Next Story