'ఆదర్శ కుటుంబం'లో 'ధురంధర్ 2' నటుడు

by Pulgam srinivas |

'ధురంధర్ 2' చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్ వీర్ సింధును ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ సినిమాలో విలన్ పాత్ర కోసం మూవీ బృందం ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆదర్శ కుటుంబంలో ధురంధర్ 2 నటుడు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ధురంధర్ 2’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్ వీర్ సింధును ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ సినిమాలో విలన్ పాత్ర కోసం మూవీ బృందం ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో ఈ పాత్ర కోసం పలువురు నటులను పరిశీలించినప్పటికీ, చివరకు ఉదయ్ వీర్ సింధునే మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story