- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సునామీ.. ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివెంజ్’ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివెంజ్’ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్న ఈ చిత్రం, విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,492.17 కోట్లు (Source: Sacnilk) వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
దేశీయంగా రూ.1000 కోట్ల దిశగా..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండో వారంలో వసూళ్లు కొద్దిగా తగ్గినప్పటికీ, మూడో వారాంతం లోకి అడుగుపెడుతున్న ఈ సినిమాకు జోరు ఏమాత్రం తగ్గలేదు. పైగా వచ్చే వారం పెద్దగా హిందీ సినిమాలేవీ బరిలో లేకపోవడం ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో దేశీయంగా త్వరలోనే సునాయాసంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
టార్గెట్ ‘దంగల్’, ‘బాహుబలి 2’..
ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో తన ప్రీక్వెల్ ‘ధురంధర్’ (రూ. 1,354.84 కోట్లు)ను దాటేసిన ‘ధురంధర్ 2’ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. తొలి 15 రోజుల కలెక్షన్ల వేగాన్ని పోల్చి చూస్తే.. ‘పుష్ప 2’ కంటే ‘ధురంధర్ 2’ చాలా ముందంజలో ఉండటం గమనార్హం. ఇదే ఊపు కొనసాగితే లాంగ్ రన్‌లో ఈ చిత్రం ‘పుష్ప 2’ని సులభంగా దాటేసి, ఆ పైస్థానాల్లో ఉన్న ‘బాహుబలి 2’, ‘దంగల్’ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-4 భారతీయ చిత్రాలు (సుమారుగా)
*దంగల్: రూ. 2,070 కోట్లు
*బాహుబలి 2: రూ. 1,810.60 కోట్లు
*పుష్ప 2: రూ. 1,742.10 కోట్లు
*ధురంధర్ 2: రూ. 1,492.17 కోట్లు (కలెక్షన్లు కొనసాగుతున్నాయి)
ఆదిత్య ధర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ‘హంజా అలీ మజారీ’ అనే ఇండియన్ స్పై పాత్రలో అదరగొట్టారు. ఆయనతో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, డానిష్ పాండోర్ వంటి భారీ తారాగణం ఈ సినిమా విజయానికి మరింత బలాన్ని చేకూర్చింది.






