Dhurandhar 2: చెత్త సినిమా.. థియేటర్‌లో నిద్రపోయా.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ బ్యూటీ

by Pulgam srinivas |

కన్నడ నటి మరియు రాజకీయ నాయకురాలు దివ్య నాకు 'ధురందర్ 2' ఏ మాత్రం నచ్చలేదని, అదొక పరమ చెత్త సినిమా" అని, సినిమా చూస్తూ థియేటర్లోనే నిద్రపోయానని కామెంట్ చేసింది.

Dhurandhar 2: చెత్త సినిమా.. థియేటర్‌లో నిద్రపోయా.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురందర్ 2 చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదలై 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధారణ టికెట్ ధరలతో కొల్లగొట్టింది. ఆ స్థాయిలో ఈ సినిమా ఇంపాక్ట్ చూపించింది. ఈ మూవీ మొదటి భాగం విడుదలైన రోజే రెండవ భాగాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. చెప్పిన విధంగానే ఈ మూవీని మార్చి 19న విడుదల చేశారు. విడుదలైన మొదటి షోకే ఈ చిత్రానికి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది.

ఈ మూవీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 172.63 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కేవలం హిందీ భాషలోనే 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో భాగం భారీ అంచనాల నడుమ విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈజీగా ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్ల దగ్గరికి వెళుతుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్ర విడుదలకు ముందే ఈ మూవీపై, ఈ సినిమా దర్శకుడిపై పొగడ్తలు కురిపించారు.

సినిమా విడుదలయ్యాక తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టార్ హీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరి కొంతమంది కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పారు. ఈ స్థాయిలో ప్రశంసలను అందుకుంటున్న ఈ చిత్రంపై ఓ నటి చేసిన కామెంట్లు పెద్ద స్థాయిలో వైరల్ అవుతున్నాయి. "నాకు ధురందర్ 2 ఏ మాత్రం నచ్చలేదని, అదొక పరమ చెత్త సినిమా" అని, సినిమా చూస్తూ థియేటర్లోనే నిద్రపోయానని కామెంట్ చేసింది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా? కన్నడ నటి మరియు రాజకీయ నాయకురాలు దివ్య. ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈమె 'ధురందర్ 2'పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Next Story