ధురంధర్ 2 తెలుగు, మలయాళ సెన్సార్ పూర్తి

by Pulgam srinivas |

తాజాగా ధురంధర్ 2 తెలుగు, మలయాళ వర్షన్స్ సెన్సార్ పూర్తయింది.

ధురంధర్ 2 తెలుగు, మలయాళ సెన్సార్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: కొంతకాలం క్రితం ధురంధర్ మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విడుదలయ్యే సమయానికి ఈ మూవీపై హిందీ ప్రేక్షకుల్లో మినహాయిస్తే బయట పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే చిత్రం విడుదల అయిందో దానికి అద్భుతమైన టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్లు పెరగడం మొదలైంది. దాదాపు 50 రోజులపాటు ఈ చిత్రానికి స్టడీగా కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా ఈ మూవీ వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను కేవలం హిందీ భాష నుండే రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రం రెండవ భాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతోమంది ఎదురుచూస్తూ వచ్చారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన రెండవ భాగం విడుదలయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ మాత్రం ఈరోజు విడుదల కాలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు, మలయాళ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. దానితో ఈరోజు ఈవినింగ్ లేదా సెకండ్ షో నుండి ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వర్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. దీనికి అద్భుతమైన పాజిటివ్ టాక్ దక్కింది. దాంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనబడుతుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.

Next Story