- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్ 2 ఔట్‌స్టాండింగ్’.. విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా ఘాటు కామెంట్స్
సందీప్ 'ధురంధర్ : ది రివెంజ్' సినిమా అద్భుతంగా ఉందని (‘Outstanding film’) అని ప్రశంసలు కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఏదైనా విషయాన్ని మాట్లాడాలి అనుకుంటే నేరుగా, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. దాంతో కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈయన రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ : ది రివేంజ్ చిత్రాన్ని వీక్షించారు. తాజాగా ఈయన ఈ చిత్రం గురించి ఆయన శైలిలో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా ఖాతాలో... గతంలో కొంతమంది రచయితలు, నటులు ప్రచార సినిమాల ద్వారా కెరీర్ నిర్మించుకున్నారని, అప్పుడు ఇండస్ట్రీ నిశ్శబ్దంగా ఉండిపోయిందని ఆయన అన్నారు.
ఇప్పుడు వారే ధురంధర్ సినిమాను విమర్శించడం నాకు ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. అలాగే, నిజాన్ని కూడా ‘ప్రచారం’గా ముద్ర వేయడం ఎప్పుడు ప్రారంభమైందో తనకి అర్థం కావడం లేదని, ఇది చాలా వింత ఆయన పేర్కొన్నారు. ఇక ధురంధర్: ది రివేంజ్ మూవీపై ఆయన పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. తాను తాజాగా ధురంధర్: ది రివేంజ్ సినిమాను చూసినట్లు, ఇది ఒక అద్భుతమైన మూవీ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక చివరగా సందీప్ ఈ సినిమా అద్భుతంగా ఉందని (‘Outstanding film’) అని ప్రశంసలు కురిపించారు. తాజాగా సందీప్ చేసిన ఈ పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.






