ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘ధురంధర్-2’.. వారికి మాత్రం బిగ్ ట్విస్ట్!

by Mallepaka Hamsa |

నిన్నటి నుంచే (మే 14) ఇండియా మినహా మిగిలిన అన్ని దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘ధురంధర్-2’.. వారికి మాత్రం బిగ్ ట్విస్ట్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’. ఈ సినిమా మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు సృష్టించింది. ఇక థియేటర్లలో రికార్డుల వేట ముగించుకుని ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.. అయితే, దీని డిజిటల్ రిలీజ్ విషయంలో ఇండియన్ ఆడియెన్స్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. ఈ సినిమా అంతర్జాతీయ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నిన్నటి నుంచే (మే 14) ఇండియా మినహా మిగిలిన అన్ని దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో కట్ చేసిన కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. మన దేశంలో ‘ధురంధర్ 2’ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకుంది. అయితే ఇండియాలో రిలీజ్ లేట్ అవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలు ప్రస్తుతం జియోహాట్‌స్టార్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు హోరెత్తుతున్నాయి. ఈ క్రేజీ క్రికెట్ సీజన్ నడుస్తున్నప్పుడు సినిమాను డిజిటల్‌గా రిలీజ్ చేస్తే వ్యూయర్‌షిప్ తగ్గిపోతుందని భావించిన సంస్థ, ఐపీఎల్ ముగిసిన తర్వాతే ఈ యాక్షన్ చిత్రాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోందని టాక్.

Next Story