మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ధ్రువ్ విక్రమ్ నెక్ట్స్ మూవీ.. DV4 డైరెక్టర్ ఎవరంటే?

by Chukka Sudharani |

ధృవ్ విక్రమ్ తదుపరి ప్రాజెక్టు DV4 మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా.. కరణ్ అవవింధ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాట్లు టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ధ్రువ్ విక్రమ్ నెక్ట్స్ మూవీ.. DV4 డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: గతేడాది ‘బైసన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్.. అనుకున్న స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాడు. కబడ్డి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. మొదటి తమిళంలో రిలీజైన ఈ మూవీ అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో వారం రోజుల గ్యాప్‌లో తెలుగులో సైతం విడుదల చేశారు. కానీ ఇక్కడ అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా పరాజయాన్ని పక్కన పెట్టిన ధృవ్ విక్రమ్ ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపినట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. DV4గా రాబోతున్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ సూర్య కరుప్పు చిత్రం రచయిత కరణ్ అవవింధ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాట్లు టాక్. అలాగే సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ధృవ్ నెక్ట్స్ ప్రాజెక్టును ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెట్టింట క్రియేట్ కాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Next Story