- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాతో ధృవ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీ.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన స్టార్ కిడ్!
ధృవ్ మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ‘ఆదిత్య వర్మ’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయారు. ఇక గత ఏడాది ‘బైసన్’ సినిమా చేసిన ధృవ్‌కు నిరాశనే ఎదరైంది. అయినప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు టాక్. తాజాగా, ధృవ్ మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ‘సిగ్మా’ చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ తన పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు.
ఇక ఈ సినిమాతో ధృవ్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రంతో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా వస్తాడనుకుంటే అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇందులో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో ఇద్దరు స్టార్ కిడ్స్ ధృవ్, జాసన్ భాగం కావడంతో అందరి దృష్టి ‘సిగ్మా’పై పడింది.






