ధర్మేంద్ర మృతి వార్తలపై స్పందించిన భార్య హేమమాలిని

by Malleboina Mahesh |

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారనే వార్తలతో బాలీవుడ్‌ అభిమానుల్లో మంగళవారం ఉదయం తీవ్ర ఆందోళన నెలకొంది.

ధర్మేంద్ర మృతి వార్తలపై స్పందించిన భార్య హేమమాలిని
X

దిశ, వెబ్‌డెస్క్‌: ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి (Dharmendra's death) చెందారనే వార్తలతో బాలీవుడ్‌ అభిమానుల్లో మంగళవారం ఉదయం తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందారని అనేక మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా పేజీలు బ్రేకింగ్‌ న్యూస్‌లతో విస్తృతంగా ప్రచారం చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. దేశవ్యాప్తంగా “లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇకలేరు” అనే పోస్టులు ట్రెండింగ్‌లోకి రావడంతో సినీ వర్గాలు సైతం గందరగోళానికి గురయ్యాయి.

అయితే ఈ వార్తలపై ఆయన కూతురు కొద్ది సేపటికే స్పందిస్తూ.. తన తండ్రి ప్రాణాలతోనే ఉన్నారని పోస్ట్ చేశారు. అలాగే ధర్మేంద్ర భార్య హేమమాలిని కూడా ఆయన మరణ వార్తలపై స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. తన ట్వీట్‌లో “ధర్మేంద్ర సురక్షితంగా ఉన్నారు. ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అలాంటప్పుడు కొందరు ఇలా అబద్ధపు వార్తలు ఎలా ప్రచారం చేయగలరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, అభిమానులు నమ్మకంగా ఉండాలని ఆమె కోరారు. హేమామాలినీ ట్వీట్‌తో తప్పుడు ప్రచారాలపై అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. “లెజెండ్ ధర్మేంద్రకు దీర్ఘాయుష్షు కలగాలి” అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story