ధర్మ యుద్ధం త్వరలో పెద్ద స్క్రీన్లపై విడుదల కానుంది.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by I. Sairam |   (  Updated:2025-06-01 05:45:11  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

ధర్మ యుద్ధం త్వరలో పెద్ద స్క్రీన్లపై విడుదల కానుంది.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీనికి దర్శకులు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మరింత హైప్‌ క్రియేట్ అయిపోయింది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం(AM Ratnam) నిర్మాణం వహించారు.

అలాగే ఈ జూన్ 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘వీరమల్లు నెల ప్రారంభమవుతుంది... అలాగే పవర్ స్టార్మ్ కూడా వస్తుంది.. ధర్మ యుద్ధం త్వరలో పెద్ద స్క్రీన్లపై విడుదల కానుంది.. హరిహరవీరమల్లు ఈ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్’ అని రాసుకొస్తూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ పై సూర్య కిరణాలు పడి మొత్తం నీడలా నల్లగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ పై మంత్ ఆఫ్ వీరమల్లు బిగిన్స్ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story