- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే, ఇండస్ట్రీని షేక్ చేసేదాన్ని..నటి బోల్డ్ కామెంట్స్ !
రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే, తన కెరీర్ సక్సెస్ బాటలో ఉండేదని ఆమె ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది నటిమణులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఇక మరికొంతమంది అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan) ఒకరు. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా చాలా సినిమాల్లో సైడ్ హీరోయిన్ పాత్రల్లో కూడా కనిపించారు. తాజాగా కృష్ణ లీల అనే సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీలో రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే, తన కెరీర్ సక్సెస్ బాటలో ఉండేదని ఆమె ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొన్ని కండిషన్లు పెట్టుకోవడం వల్లే తాను సినిమా ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయారని ఆమె ఎమోషనల్ అయ్యారు. రొమాంటిక్ సీన్లు చేయొద్దని కండిషన్ పెట్టుకోవడంతో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒకవేళ ఆ సీన్లు చేసి ఉంటే ఇండస్ట్రీని షేక్ చేసేదాన్ని అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడు ఊహించలేదని తెలిపారు. బాగా ఆమె నటించిన కృష్ణ లీల నవంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతోంది.






