ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ‘కర’ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది.

ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కర’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం, అప్పట్లో దేశంలో ఏర్పడిన ఇంధన సంక్షోభం వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసిన నెలరోజులకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ‘కర’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మే 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. కాగా.. ఈ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌కు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించగా.. ప్రేమలు ఫేమ్ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ పతాకాలపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Next Story