- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ధనుష్ ‘కర’
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కర' సినిమా ఇండియా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ మంచి రెస్పాన్స్ పొందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ధనుష్ కొంతకాలం క్రితం ‘కర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని ఈ ఏప్రిల్ నెలలో తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనే స్థాయి విజయాన్ని మాత్రమే సాధించింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ సినిమా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్‌లో ఈ సినిమా టాప్‌లో కొనసాగుతోంది. ఇలా థియేటర్లలో యావరేజ్ విజయాన్ని అందుకున్న ‘కర’ చిత్రం, ఓటీటీలో మాత్రం మంచి స్పందనను సొంతం చేసుకుంది.






