ధనుష్ ‘కారా’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్.. ఊహించని పోస్టర్‌తో షాకిచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

ఈ చిత్రంలో ధనుష్ సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ధనుష్ ‘కారా’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్.. ఊహించని పోస్టర్‌తో షాకిచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తున్నారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ‘కారా’ ఒకటి. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కె. గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ధనుష్ ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. శక్తివంతమైన విలన్లతో పోరాడేందుకు హింసా మార్గాన్ని ఎంచుకునే పత్తి రైతు ‘కరసామి’ పాత్రలో ఆయన నటిస్తున్నారు. తాను నాటిన విత్తనాల ఫలం.. అది మంచైనా, చెడైనా సరే అనుభవించడానికి సిద్ధపడే ఒక మొండి వ్యక్తిగా, తన పాపాల నుండి విముక్తి పొందాలనుకునే ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌లో ధనుష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ధనుష్ సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మమిత ఎప్పుడూ లేని విధంగా చాలా డీ-గ్లామరస్ లుక్‌లో కనిపిస్తోంది. ఎటువంటి మేకప్ లేకుండా, మెరూన్ కలర్ చీరలో, ఒక పాత ఇంట్లో బాధగా కూర్చుని ఉన్న ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఆమె ధనుష్ భార్యగా ‘సెల్లి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పెళ్లైన మహిళగా మమిత నటన ఈ సినిమాకు హైలైట్ కానుందని సమాచారం. ఈ భారీ చిత్రంలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్ జయరామ్, పృథ్వీ పాండియారాజన్, సూరజ్ వెంజరమూడు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story