- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కర’ కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. టీమ్ ధీమాతో సినిమాపై మరింత హైప్
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కర’ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కర’ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా సినిమాపై హై లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం, అప్పట్లో దేశంలో ఏర్పడిన ఇంధన సంక్షోభం వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. 2 గంటల 41 నిమిషాల రన్‌టైమ్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ పతాకాలపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘ఒక సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లోకి చిక్కుకున్నప్పుడు ఏమి జరుగుతుందనేదే ఈ సినిమా కథ’ అని చెప్పుకొచ్చారు. అలాగే సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని, ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోందని, కచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని టీమ్ ధీమ వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షనగా నిలవనుంది.






