- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ధనుష్..
నిర్మాతగా, డైరెక్టర్‌గా, హీరోగా, ఇలా మల్టీ స్టారర్‌గా దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు.

దిశ, సినిమా: నిర్మాతగా, డైరెక్టర్‌గా, హీరోగా, ఇలా మల్టీ స్టారర్‌గా దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. తాజాగా D-55 కు సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రియేట్ అయ్యేలా చేశారు. OM అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చెయ్యగా.. రాజ్ కుమార్ పెరియసామి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. D-55 నుంచి అప్డేట్ వచ్చి గంటలు గడవకముందే D-56కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ధనుష్ హీరోగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ ఫాంటసీ, చారిత్రక అండ్ రాజకీయ అంశాలతో కూడిన ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ బ్యానర్‌పై ఇషారి. కె గణేష్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2026 నుండి ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ఈ మూవీ టైటిల్ కూడా త్వరలోనే రిలీజ్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ధనుష్ ఫ్యాన్స్.






