Dhanush : వీకెండ్ కోసం సిద్ధంగా ఉండండి.. ఇడ్లీకడై నుంచి మరో అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ‘ఇడ్లీ కడై’ చిత్రం.

Dhanush : వీకెండ్ కోసం సిద్ధంగా ఉండండి.. ఇడ్లీకడై నుంచి మరో అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ‘ఇడ్లీ కడై’ చిత్రం. కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్డేట్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ అక్టోబర్ 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఇడ్లీ కడై ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.

సెప్టెంబర్ 20న ఈ ట్రైలర్ రాబోతున్నట్లు తెలుపుతూ ‘మంచి ఆరోగ్యకరమైన వీకెండ్ కోసం సిద్ధంగా ఉండండి.. ఈ శనివారం కోయంబత్తూరులో ఇడ్లీకడై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగబోతున్నది’ అంటూ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్.పార్తిబన్, పి.సముతిరకని, రాజ్‌కిరణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్, రెడ్ జాయింట్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. లింక్

Next Story