- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dhanush: 'జాలీ గా రండి.. జాలీగా వెళ్లండి' అంటున్న ధనుష్.. కొత్త సినిమా ట్రైలర్ చూశారా?
ఈ చిత్రం ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఇండస్ట్రీలో హీరో ధనుష్ ( Dhanush ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలను చేస్తున్నాడు. " సార్ " ( sir movie ) మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇక, ఈయన స్టార్ డమ్ గురించి మనందరికీ తెలిసిందే. హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. అలాగే, దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. అతని డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' (Jabilamma Neeku Antha Kopama). ఈ చిత్రం ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా, మూవీ తెలుగు ట్రైలర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
తమిళ సినిమాల్లో స్టార్ గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతే కాదు, రెండు సార్లు నేషనల్ అవార్డును అందుకున్నాడు. గత కొన్నేళ్ళగా నటనతో పాటు డైరెక్షన్ పై కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన 'పా పాండి' మూవీ 2018లో రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు, వసూళ్లను సాధించింది. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ట్రైలర్ లో 'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి' అంటూ హీరో చెప్పిన డైలాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిలో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటీ నటులు నటించారు.
తన అక్క కొడుకు పవిష్‌ను హీరోగా పెట్టి ధనుష్ ( Dhanush ) " జాబిలమ్మ నీకు అంత కోపమా " (Jabilamma Neeku Antha Kopama) కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవిష్ సరసన అనికా సురేంద్రన్ నటించగా, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, సతీష్, వెంకటేష్, రమ్య రంగనాథన్ వంటి నటీ నటులు నటించారు. ప్రియాంక మోహన్ 'గోల్డెన్ స్పారో' పాటలో గెస్ట్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. టీనేజ్ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను తన వి క్రియేషన్స్ పతాకం పై నిర్మించారు. యూత్ టార్గెట్‌గా చేసుకుని తీసినట్టుగా కనిపిస్తోంది.






