గ్రేట్.. కొడుకు కోసం మళ్ళీ ఒక్కటైన ఐశ్వర్య-ధనుష్ !

by velandi.Saikiran |

స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో రజినీకాంత్ అల్లుడుగానే కాకుండా తనకంటూ ఒక

గ్రేట్.. కొడుకు కోసం మళ్ళీ ఒక్కటైన ఐశ్వర్య-ధనుష్ !
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో రజినీకాంత్ అల్లుడుగానే కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ధనుష్. అయితే అలాంటి హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకొని ఇద్దరు విడివిడి గానే ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత విడిపోయింది.

ఇక తన భార్యకు విడాకులు ఇచ్చిన ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు ఈ మధ్య విపరీతంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో... తాజాగా తన భార్యతో కలిసి మెరిసాడు హీరో ధనుష్. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. హీరో ధనుష్ - ఐశ్వర్య కుమారుడు యాత్ర రాజా స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా... నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు.

ఈ తరుణంలో తమ కొడుకును ఇద్దరు హగ్ చేసుకుని మరి ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోను సూపర్ రజినీకాంత్ షేర్ చేశారు. తన మనవడికి రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పారు. నా ముద్దుల మనవడా మొదటి మైలురాయి దాటేశావ్... యాత్ర కన్నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు. కాగా ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కో పేరెంటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కొడుకు కోసం ఇద్దరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అంటున్నారు.


Next Story