- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanush : బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సీక్వెల్ ప్రకటించిన ధనుష్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం ‘ఇడ్లీ కడై’.

దిశ, సినిమా: ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం ‘ఇడ్లీ కడై’. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్.. వడ చెన్నై 2పై అప్డేట్ ఇచ్చాడు. డైరెక్టర్ వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వడ చెన్నై’ సినిమా సూపర్ హిట్ అందుకుంది.
దీంతో ఈ సినిమా సీక్వెల్ గురించి ఫ్యాన్స్ ఎప్పటినుంచే వెయిట్ చేస్తుండగా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెట్రిమారన్.. ‘శింబుతో చేయబోతున్న సినిమా త్వరలోనే మొదలవుతుందని.. ఈ మూవీ పూర్తవగానే వడ చెన్నై 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాము’ అని తెలిపారు. ఇక రీసెంట్‌గా ఇడ్లీ కడై ప్రమోషన్స్‌లో ధనుష్ దీనిపై మాట్లాడుతూ.. ‘వడ చెన్నై 2 షూటింగ్ 2026లో మొదలవుతుంది. ఈ మూవీని 2027లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఫ్యాన్స్ ఫేవరెట్ మూవీ కోసం డైరెక్ట్‌గా ధనుష్ అప్డేట్ ఇవ్వడంతో.. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.






