- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి జతకట్టబోతున్న ధనుష్ అండ్ సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరంటే?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కోలీవుడ్ స్టా్ర్ హీరో ధనుష్‌తో మరోసారి జత కట్టేందుకు సిద్ధం అయిందట. దీనికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ధనుష్ నటిస్తున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లనుందట.
అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వచ్చే నెలలో స్టార్ట్ కానున్నాయని టాక్. షూటింగ్ వచ్చే ఏడాదిలో స్టార్ట్ చెయ్యనున్నారట. ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ‘వావ్ సూపర్ కాంబో’, వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే ధనుష్, సాయిపల్లవి కాంబోలో మారి-2 మూవీ వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపైకి వస్తే ఎలా ఉంటుందో అని సర్‌ప్రైజ్ అవుతున్నారు నెటిజన్లు.






