- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో సందడి చేసిన దేవగుడి చిత్ర యూనిట్
పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర యూనిట్ తిరుపతిలో ఉన్న గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్‌లో సందడి చేశారు

దిశ, సినిమా : పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర యూనిట్ తిరుపతిలో ఉన్న గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్‌లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎర్రపురెడ్డి ఆనంద్ రెడ్డి, టీ.వి.మురళీనాథ్ రెడ్డి, కళాశాల A.O స్వామినాథ్, రాయలసీమ విద్యాసంస్థల అధినేతలు ఎర్రపురెడ్డి కొండా రెడ్డి, ఎర్రపురెడ్డి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హీరో కావాలని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు బెల్లం రామ కృష్ణారెడ్డి.






