Tollywood: నెగిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలుగు సినిమాలివే..!

by Phanindra |   (  Updated:2025-02-05 04:19:05  IST  )

కొన్ని సినిమాలు మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత హిట్ అయిపోతుంటాయి

Tollywood: నెగిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలుగు సినిమాలివే..!
X

దిశ, వెబ్ డెస్క్ : వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. ఒకప్పుడు ట్రెండ్ వేరు.. ఇప్పుడు వేరు చాలా మారిపోయింది. ఫైనల్ గా ప్రేక్షకుల ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న తెలుగు సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 జల్సా ( Jalsa ) : పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది " జల్సా ". భారీ అంచనాలతో 2008లో విడుదలైంది. కానీ , ఫస్ట్ డే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ, సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

2 సరైనోడు ( Sarrainodu ) : అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీ 2016 సమ్మర్ కానుకగా రిలీజ్ అయింది. మొదటి రోజు ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి వెళ్ళడంతో మంచి విజయం అందుకుంది.

3 జనతా గ్యారేజ్ ( Janatha Garage ) : ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో ఈ మూవీ మన ముందుకొచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది.

4 జై సింహా ( Jai Simha ) : బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మొదటి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, హిట్ గా నిలిచింది.

5 సరిలేరు నీకెవ్వరు ( Sarileru Neekevvaru ) : మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ మూవీ మొదటి రెండు రోజులు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది.

6 పుష్ప ది రైజ్ ( Pushpa: The Rise ) : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ అంటూ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి.

7 బంగార్రాజు ( Bangarraju ) : నాగార్జున – నాగచైతన్య కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్ప‌ట్లో సంక్రాంతి బరిలో దిగి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ, ఈ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేసింది.

Next Story