రజినీకాంత్ కూలీ సినిమా చూశాను.. అదిరిపోయింది: డిప్యూటీ CM ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-13 13:28:58  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం(Coolie Movie) ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

రజినీకాంత్ కూలీ సినిమా చూశాను.. అదిరిపోయింది: డిప్యూటీ CM ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం(Coolie Movie) ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘రేపు విడుదల కానున్న కూలీ సినిమాను చూసాను. ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని ట్వీట్‌లో స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు మొత్తం కోలీవుడ్ మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కలానిథి మారన్ నిర్మించారు.

Next Story