డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ.. పద్మశ్రీ రాజేంద్రప్రసాద్‌కు ఘన సత్కారం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-04 13:56:58  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను ప్రముఖ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మర్యాదపూర్వకంగా కలిశారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ.. పద్మశ్రీ రాజేంద్రప్రసాద్‌కు ఘన సత్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను ప్రముఖ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాజేంద్రప్రసాద్‌ను పద్మశ్రీ అవార్డు వరించిన నేపథ్యంలో ఆయన ఇవాళ మంగళగిరిలోని డిప్యూటీ సీఎం ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రాజేంద్రప్రసాద్‌కు పవన్ స్వాగతం పలికారు. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన హాస్యంతో, వైవిధ్యమైన నటనతో అలరిస్తున్న రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ దక్కడం పట్ల పవన్ కళ్యాణ్ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ను పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కరించి, పూలమొక్కను బహూకరించి అభినందనలు తెలియజేశారు. కళారంగంలో రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పవన్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం సత్కారానికి రాజేంద్రప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story