ప్రీరిలీజ్ ఫంక్షన్: డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ఎమోషనల్

by Gantepaka Srikanth |

హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎమోషనల్ అయ్యారు.

ప్రీరిలీజ్ ఫంక్షన్: డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎమోషనల్ అయ్యారు. శిల్పకళా వేదికలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అభిమానులు లేకపోతే నేను లేను అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను అని చెప్పారు. అనేకసార్లు కిందపడ్డాను.. పైకి లేచాను.. సక్సెస్‌లు సాధించాను.. ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను.. కానీ అన్ని సమయాల్లో అభిమానులు నా వెంట ఉన్నారు. పడిపోయిన ప్రతీసారి నన్ను పైకి లేపారు అని పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

కాగా, పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో జులై 24వ తేదీన విడుదల కాబోతోంది. పవన్‌ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమానికి కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫ్రీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హాజరయ్యారు.

Next Story