- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా 158 ఓపెనింగ్‌కు డిప్యూటీ సీఎం.. అందుకే కలిశారా?
మెగా 158 ఓపెనింగ్ కోసమే డైరెక్టర్ బాబీ కొల్లి తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిసినట్లు తెలుస్తుంది. .

దిశ, సినిమా: డైరెక్టర్ బాబీ కొల్లి తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిసిన విషయం విదితమే. ఈ మేరకు ఆయనతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం.. ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషిలా కనిపించారు.. రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం.. కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయితే.. పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలిశారు అనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. అందుతున్న సమాచారం మేరకు ‘మెగా158’ 11న ఓపెనింగ్ ఉండగా.. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను గెస్ట్‌గా ఆహ్వానించేందుకు వెళ్లిరని తెలుస్తుంది. అంతే కాకుండా.. ఓపెనింగ్‌కు ఆయన రావొచ్చనే టాక్ ఫిలిమ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. కాగా.. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మెగా-158’ తెరకెక్కిస్తుండగా.. దీనికి సంబంధించిన పూజాకార్యక్రమాలు 11న జరగబోతున్నట్లు సమాచారం.






