- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీమాంటి కాలనీ 3 : ఫస్ట్ పోస్టర్‌కే వణికించిన మేకర్స్..
హారర్ ఫిల్మ్ అంటే గుర్తొచ్చే సినిమాల్లో ‘డీమాంటి కాలనీ’ ముందు వరుసలో ఉంటుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమాకు భారీ ఫాలోయింగ్ ఉంది. 2015లో ఈ మూవీ రిలీజ్ కాగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: హారర్ ఫిల్మ్ అంటే గుర్తొచ్చే సినిమాల్లో ‘డీమాంటి కాలనీ’ ముందు వరుసలో ఉంటుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమాకు భారీ ఫాలోయింగ్ ఉంది. 2015లో ఈ మూవీ రిలీజ్ కాగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘డీమాంటి కాలనీ 2’ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అరుల్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ ఫ్రాంచైజ్‌కు మూడో భాగంగా ‘డీమాంటి కాలనీ- 3’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ను చూస్తే భయపెట్టిస్తుండగా.. గర్భంతో ఉన్న ప్రియా భవానీ శంకర్ పోస్టర్.. పొట్ట ప్రాంతంలో బ్లడ్ షేడ్స్.. రక్తంతో నిండిన చేతులతో పిలుస్తూ.. వెన్నులో వణుకు పుట్టించేలా రూపొందించారు. క్యాండిల్స్ మధ్యలో కూర్చున్న ఆమె లుక్ చూస్తుంటే.. ఈ సారి కూడా హారర్ ప్రియులకు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుందని.. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది.






