- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో సంచలనం: రూ.400 కోట్ల దావా.. సినిమా రిలీజ్ ఆపేయాలని డిమాండ్
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక భారీ చట్టపరమైన పోరాటం మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'పూజా ఎంటర్టైన్మెంట్' (Puja Entertainment) అధినేత వాస్తూ భగ్నానీ.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక భారీ చట్టపరమైన పోరాటం మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'పూజా ఎంటర్టైన్మెంట్' (Puja Entertainment) అధినేత వాస్తూ భగ్నానీ. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టిప్స్ ఇండస్ట్రీస్' (Tips Industries), దాని ప్రమోటర్లు రమేష్ తోరాస్, కుమార్ తారానీలతో పాటు ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్లపై బాంబే హైకోర్టులో ఏకంగా రూ. 400 కోట్ల భారీ నష్టపరిహారం దావా వేశారు. తమ అనుమతి లేకుండా తమ పాత సూపర్ హిట్ సినిమా పాటను వాడుకున్నారనే కాపీరైట్ ఉల్లంఘన (Copyright Infringement) ఆరోపణలపై పూజా ఎంటర్టైన్మెంట్ ఈ లీగల్ యాక్షన్ తీసుకుంది.
వివాదానికి కారణం ఇదే..
1999లో వాస్తూ భగ్నానీ నిర్మాణంలో, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమా 'బీవీ నెం.1' (Biwi No. 1). ఈ సినిమాలోని 'చున్నరి చున్నరి', 'ఇష్క సోనా హై' అనే పాటలు అప్పట్లో దేశాన్ని ఊపేశాయి. అయితే, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా త్వరలో రాబోతున్న 'హై జవానీతో ఇష్క హోనా హై' అనే కొత్త సినిమాలో ఈ రెండు ఐకానిక్ పాటలను రీక్రియేట్ (రీమిక్స్) చేసి వాడుకున్నారు. అయితే తమ హక్కులు ఉన్న పాటను ఎలాంటి లైసెన్స్ లేదా అనుమతి లేకుండా అక్రమంగా వాడేశారని పూజా ఎంటర్టైన్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఆడియో హక్కులు ఎప్పుడో రద్దయ్యాయి: లాయర్
పూజా ఎంటర్టైన్మెంట్ తరఫు న్యాయవాది వీకే దూబే ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. "గతంలో కేవలం ఆడియో హక్కులు మాత్రమే టిప్స్ కంపెనీకి ఒప్పందం ప్రకారం ఇవ్వబడ్డాయి. 2018లో వారు విజువల్ (వీడియో) హక్కుల కోసం మమ్మల్ని అడిగారు. కానీ ఆ డీల్ కుదరలేదు. ఆ తర్వాత రాయల్టీ నిబంధనలు పాటించనందుకు టిప్ఫికు ఇచ్చిన పాత ఆడియో హక్కులను కూడా పూజా ఎంటర్టైన్మెంట్ నోటీసు ద్వారా రద్దు చేసింది. కాబట్టి ప్రస్తుతం ఆ పాటలపై వారికి ఎలాంటి హక్కులు లేవు. ఒకవేళ వారి చట్టబద్ధమైన యజమానులైతే కోర్టుకు డాక్యుమెంట్లు సమర్పించాలి' అని స్పష్టం చేశారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ కూడా ఈ పాటలను అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్నారని లాయర్ ఆరోపించారు. 'బీవీ'నెం' తో పాటు 'తేరా జాదూ చల్ గయా', 'బడ్ మీయాన్ ఛోటీ మీయాన్' వంటి మరో 4-5 సినిమాల సాంగ్స్ విషయంలోనూ టిప్స్ ఇలాగే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
సినిమా రిలీజ్ ఆపేయాలని డిమాండ్..
పూజా ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో బాంబే హైకోర్టును పలు కీలక ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వివాదాస్పద సాంగ్స్ ఉన్నందున 'హై జవానీ తో ఇష్క హోనా హై' సినిమా విడుదల, పంపిణీ, థియేట్రికల్ ప్రదర్శన, ఓటీటీ స్ట్రీమింగ్లను తక్షణమే నిలిపివేయాలి (Stay). సినిమా ప్రమోషనల్ కంటెంట్ నుండి ఆ పాటలను పూర్తిగా తొలగించాలి. సినిమా పేరును (Title) కూడా మార్చాలి. ఒకవేళ టిప్స్ సంస్థ, డేవిడ్ ధావన్ ఈ డిమాండ్లను ఉల్లంఘిస్తే.. అదనంగా మరో రూ. 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. బాలీవుడ్‌లో పాత పాటలను రీమిక్స్ చేసే ట్రెండ్‌పై ఎప్పటినుంచో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. రెండు పెద్ద నిర్మాణ సంస్థల మధ్య రేగిన ఈ రూ. 400 కోట్ల పోరు' ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది.






